సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్.. అలా చేస్తే రూ.10 లక్షల జరిమానా?

praveen
ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక ఈ టెక్నాలజీ ద్వారా ప్రతి పని కూడా సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ప్రతి మనిషి టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్నాడు. అన్ని పనులను ఎంతోఈజీగా చేసుకోగలుగుతున్నాడు. కానీ ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ కొన్ని అనర్థాలకు కూడా కారణం అవుతుంది. ముఖ్యంగా ఇక సైబర్ నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఎంతోమంది సైబర్ నేరాలు అమాయకులను టార్గెట్ చేస్తూ ఖాతాలను ఖాళీ చేస్తూ ఉన్నారు.


 ఏదో ఒక రూపంలో ఇలా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది ఏకంగా సిమ్ విక్రయాల  పేరుతో మోసాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. సిమ్ కొనే సమయంలో ఆధార్ కార్డు లేదా పాన్ కార్డును ప్రూఫ్ గా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రూఫ్ లను ఇక సైబర్ నేరాలకు తీసుకుంటున్న సిమ్ కార్డును విక్రయించే డీలర్లు కొంతమంది  నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఇంకొంతమంది వినియోగదారులకు తెలియకుండా అదే ప్రూఫ్ లతో  నకిలీ సిమ్ లు తీసుకోవడం కూడా చేస్తున్నారు. ఇక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.


 ఇకనుంచి కొత్త సిమ్ కార్డులు జారీ చేసే డీలర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే సిమ్ కార్డును విక్రయించేవారు ముందుగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవలసి ఉంటుంది  ఆ తర్వాత బయోమెట్రిక్ తప్పనిసరి అని టెలికామ్ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. ఒకవేళ సిమ్ కార్డులు వినియోగిస్తున్న డీలర్లు ఎవరైనా ఇలాంటి నిబంధన ఉల్లంఘించారు అంటే ఏకంగా 10 లక్షల వరకు జరిమానా విధించబోతున్నట్లు తెలిపారు. అందుకే సిమ్ కార్డు విక్రయించే డీలర్లు ముందుగా పోలీసు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ నిబంధన వల్ల నకిలీ సిమ్ కార్డుల సంఖ్యను తగ్గించడంతోపాటు సైబర్ నేరాలు అరికట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sim

సంబంధిత వార్తలు: