బాలుడిని బావిలో వేలాడదీసిన యువకుడు.. ఎందుకో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో మనుషులు సాటి మనుషుల విషయం లో ప్రవర్తిస్తున్న తీరు అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి పడేవారు.. కానీ ఇప్పుడు సొంత వారి విషయం లో కూడా మానవత్వాన్ని చూపించలేక పోతున్నారు. ముఖ్యం గా చిన్న చిన్న కారణాలకి ఉన్మాదులుగా మారి పోతూ సాటి మనుషుల పట్ల కరకశంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది.

 దొంగతనం చేశాడు అనే ఆరోపణ లతో ఒక బాలుడిని దాదాపు 20 అడుగుల లోతైన బావిలో చేయి పట్టుకుని వేలాడ దీసాడు ఒక యువకుడు.. అయితే ఇక ఒక యువకుడు ఇలా బాలుడు వేలాడదీస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి పక్కనే ఉండి ఇదంతా వీడియో తీయడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని చతల్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. లవ్ కుష్ నగర్ లోని అక్టోహాన్ ప్రాంతంలో మొబైల్ దొంగతనం చేశాడంటూ ఒక బాలుడిని పట్టుకున్నాడు యువకుడు. అతని దారుణంగా కొట్టాడు..

 అంతటితో ఆగకుండా ఏకంగా 20 అడుగుల లోతైన బావిలో ఐదు నిమిషాల పాటు ఒక చేత్తో పట్టుకొని వేలాడదీసాడు. తాను దొంగతనం చేయలేదని అలాంటి వాడిని కాదని ఎంత బ్రతిమిలాడుకున్నా కనికరించలేదు. ఇక అదే సమయంలో అటువైపుగా వెళుతున్న యువకుడు అదంతా వీడియో తీసి తల్లిదండ్రులకు చూపించాడు. ఇక ఆ తర్వాత రోజు తల్లిదండ్రులు సదరు బాలుడుతో పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు అజిత్ రాజ్పుత్ అనే యువకుడిపై హత్యాయత్నం చట్టం కింద కేసు నమోదు చేసి అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటన కాస్తా స్థానికం గా సంచలనం గా మారి  పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: