అలా చేయలేదని.. భార్యను బంధువుల పక్కలోకి పంపించాడు?

praveen
నేటి రోజుల్లో మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సభ్యసమాజం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ప్రతి ఒక్కరు భయ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనికి ఎక్కువ విలువ ఇస్తున్న మనుషులు మానవ బంధాలకు విలువ ఇవ్వడం పూర్తిగా మరిచిపోతున్నారు. దీంతో సొంత వారి విషయంలోనే దారుణంగా ప్రవర్తిస్తున్నా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 సాధారణంగా ఒక సారి సాంప్రదాయ బద్దంగా బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత భర్త భార్యకు ప్రతిక్షణం రక్షణగా నిలువాలన్న విషయం తెలిసిందే. ఏ సమస్య వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి.. అంతేకాదు భార్య గురించి పరాయి వ్యక్తులు ఎవరైనా సరే చెడుగా మాట్లాడితే అసలు ఊరుకోకూడదు. ఇలా సాధారణంగా ఏ భర్తలు ఎవరైనా సరే ఇలాగే ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం నీచాతి నీచంగా వ్యవహరించాడు.

 పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లపాటు భార్యతో ఎంతో సాఫీగానే సంసారం చేశాడు. కానీ అదనపు కట్నం కావాలంటూ అసలు రూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం కోసం  భార్యను వేధిస్తూ ఉండేవాడు భర్త. ఇటీవల ఏ భర్త చేయకూడని ఒక నీచమైన పని చేశాడు. అదనపు కట్నం తేవడం లేదని ఏకంగా భార్యపై బంధువులతో అత్యాచారం చేయించాడు దుర్మార్గుడు. రాజస్థాన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి 2019లో పెళ్లి జరిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. ఈ క్రమంలో ఇటీవల ఇంటికి తీసుకోచ్చిన  భర్త బంధువులతో అత్యాచారం చేయించాడు. ఇదంతా వీడియో తీశాడు. వీటిని ఆన్ లైన్ లో పెట్టి డబ్బు సంపాదిస్తాను అంటు భార్యకు చెప్పాడు.  భార్య పోలీసులను ఆశ్రయించడంతో ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: