డాక్టర్ గా మారిన ఆయా.. ఇద్దరి ప్రాణం పోయింది?

praveen
మొన్నటి వరకు ఎంతో మంది వైద్యులు కరోనా వైరస్ సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను రక్షిస్తూ ఉంటే.. కొన్ని ఆస్పత్రుల్లో మాత్రం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఏకంగా అక్కడ పనిచేస్తున్న ఆయాలే నర్స్ లుగా మారిపోయి చికిత్స అందిస్తూ ఉండటం ఎంతోమంది జనాల పాలిట శాపంగా మారిపోతుంది. కొన్ని కొన్ని సార్లు వైద్యం వికటించి ఇక చివరికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో కూడా ఇలాంటి దారుణ ఘటన జరిగింది.


 నిలోఫర్ లొ ఇంజక్షన్లు వికటించడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే ఇలా అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమే అన్నది తెలుస్తుంది. డాక్టర్లు నర్సులు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్న ఆయా లే వైద్యం చేస్తున్నారని ఇక ఇంజక్షన్లు కూడా ఇస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.. ఇలా నర్సులు డాక్టర్లు లేకుండా ఆలయాలే ఇష్టానుసారంగా ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లనే తమ పిల్లలు ఇంజెక్షన్ చేసిన క్షణాల్లో ప్రాణాలు వదిలారు అంటూ తల్లిదండ్రులు తమ బాధను చెబుతున్నారు.


 ఇలా తమ పిల్లల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ వద్ద చిన్నారుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నిలోఫర్ ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్లు మరోలా చెబుతున్నారు. ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయానికి చిన్నారుల ఆరోగ్యం విషమించిందని వివరణ ఇస్తూ ఉండడం గమనార్హం. కాగా మరోవైపు డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు చనిపోయారని నిలోఫర్ వద్ద ఆందోళన చేపట్టడంతో ఇక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఘటనతో మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా భయాందోళనలో మునిగిపోయారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: