ఛీ అసలు వీడు కొడుకేనా.. తల్లిని కాలితో తంతూ?

praveen
మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోయింది. పరాయి వాళ్ల విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించలేకపోతున్నారు.. ముఖ్యంగా రక్తం పంచుకుని పుట్టిన పిల్లలే తల్లిదండ్రుల విషయంలో శాపంగా మారిపోతున్నారు.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలో చూస్తుంటే ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. నవమాసాలు మోసి భరించలేని నొప్పిని సంతోషం గా బరిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. పుట్టినప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ ఏ కష్టం రాకుండా పెంచుతోంది.

 ఇక కొడుకుని పెంచి ప్రయోజకుల్ని చేయాలని కలలు కంటోంది. పిల్లలు పుట్టినప్పుడు నుంచి పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం తల్లిదండ్రులకు వృద్ధాప్యం లోకి వచ్చిన తర్వాత కడుపున పుట్టిన పిల్లలు కాలితో తన్నినంత పని చేస్తున్నారు. ఇక్కడ ఓ కొడుకు కన్నతల్లి విషయంలో కర్కశంగా ప్రవర్తించాడు. తల్లి వృద్ధురాలు అని కూడా చూడకుండా దారుణంగా కాళ్లతో తన్నడం కర్రలతో కొట్టడం చేసి హింసించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానంద పురం లో వెలుగులోకి వచ్చింది.

 నాగమణి భర్త వెంకటేశ్వరరావుకు కొన్నేళ్ల కిందట ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించింది.  ఇక ఎంతో కష్టపడి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకున్నారు. అయితే మూడేళ్ల కిందట వెంకటేశ్వరరావు చనిపోవడంతో ఇక వేరే గ్రామంలో ఉంటున్న  కుమారుడు శేషు  భార్యతో కలిసి తల్లి ఇంటికి వచ్చి తిష్ట వేస్తాడు. ఇక ఇన్నాళ్లు దూరంగా ఉన్న కొడుకు ఇంటికి వచ్చేయడంతో ఇక తనకు వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడని ఆ తల్లి ఎంతో సంబరపడిపోయింది. కాని నిత్యం ఆస్తి కోసం తల్లిని వేధిస్తూ  ఉండేవాడు శేషు. ఇటీవలే మరింత చచ్చిపోయాడు. తల్లిని దారుణంగా కాళ్ళతో తంతు కర్రలతో  కొడుతూ దాడి చేశాడు. తల్లి వద్దు అని ఎంత వేడుకున్నా వినలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు పోలీసుల వరకు వెళ్లడంతో చివరికి నిందితుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: