సమాజమా సిగ్గుపడు : తండ్రే అలా చేశాడు?
సభ్య సమాజమా సిగ్గు పడు.. ఎందుకంటే ప్రస్తుతం సమాజం మొత్తం నాగరికత వైపు అడుగులు వేస్తుంటే.. ఇప్పటికీ ఆడపిల్ల మాత్రం ఈ సమాజంలో బతకగలనా అనే ప్రశ్నార్ధక జీవితాన్ని గడుపుతుంది. కాలు బయట పెడితే ఆకతాయిలు.. ఉద్యోగానికి వెళితే సహోద్యోగులు.. ఇక అందరినీ దాటుకుని ఇంట్లోకి వచ్చి సురక్షితంగా ఉందాము అనుకుంటే ఏకంగా రక్తం పంచుకుని పుట్టి వావి వరసలు మరిచిన మానవ మృగాలు. ఎంతమంది నుంచి తప్పించుకున్న ఆడపిల్ల చివరికి అత్యాచారానికి గురి అవుతూనే ఉంది. మేము ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం.. కొత్త చట్టాలను తీసుకొస్తాం.. ఆడపిల్ల మీద ఈగ కూడా వాలనివ్వం అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నాయి తప్ప.. ఆడపిల్ల జీవితాలను మాత్రం కాపాడటంలో అంత శ్రద్ధ చూపించడం లేదు.
సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తండ్రి కూతురి పాలిట కామం తో రగిలి పోయాడు. చివరికి ఇక కూతురిపైనే లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అమీన్పూర్ మండల పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో నివాసం ఉండే వ్యక్తి కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలోనే తల్లి తన అన్నకు రాఖీ కట్టడానికి పుట్టింటికి వెళ్ళిన సమయంలో ఇక అదే అదనుగా భావించిన కామాంధుడు ఏకంగా చిన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.