మెడికల్ షాప్ ఓనర్ తో మహిళ రాసలీలలు.. చివరికి దారుణం ?
అయితే ఈ వరుస విషయం కాస్త ఆమె భర్తకు కూడా తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త మెడికల్ షాప్ ఓనర్ ను మందలించాడు. అయినా మెడికల్ షాప్ ఓనర్ అతని భార్యతో అలాగే వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం దీంతో మెడికల్ షాప్ ఓనర్ ను అతడు చంపేశాడు. అసలు వివరాల్లోకి వెళితే... శ్రీ కృష్ణాపూర్ ప్రాంతానికి చెందిన మిలాన్ కు ఓ మెడికల్ షాప్ ఉన్నది. అయితే.. ఆ మెడికల్ షాప్ ఓనర్ తన షాపు దగ్గర లోనే ఉన్న కహార్ అనే... వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్ని నెలలుగా ఈ వ్యవహారం నడుస్తోంది.
అయితే రాసలీలల విషయం కాస్త కహార్ కు తెలిసిపోయింది. దీంతో మిలాన్ కు కహార్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ అతని భార్య తో రాసలీలలు కొనసాగించాడు మిలాన్. ఇక ప్రయోజనం లేదని భావించిన కహార్... మిలన్ ను చంపేశాడు. ఎవరు లేని సమయంలో మిలాన్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచాడు కహార్. అయితే అక్కడే ఉన్న స్థానికులు మిలాన్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అంతలోనే మిలాన్ మృతి చెందాడు. ఇక మిలన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కహార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.