మద్యం మత్తులో పురుగుల మందు తాగిన యువకుడు.. చివరికి..?

praveen
మద్యం ఆరోగ్యానికి హానికరం ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మద్యం తాగకుండా మాత్రం ఉండలేరు. అయితే మద్యం తాగడం ఒక మోతాదులో ఉంటే సరే కానీ ఇక మద్యం ఏకంగా ఒక మనిషిని కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చింది అంటే ఇక ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి అయితే ఇప్పటికే మద్యానికి బానిసైన ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితులు కూడా వెలుగులోకి వచ్చాయి.  మద్యం కారణంగా కుటుంబ బాధ్యతలను వదిలేసి అందరూ కూడా రోడ్లపై తిరగడం వంటివి కూడా అప్పుడప్పుడు చూస్తూవుంటాం.  ఇక మరికొంతమంది మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితిలో ఉండి పోతూ ఉంటారు.



 అంతేకాదు మద్యం ఈ మధ్యకాలంలో ఎంతోమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూన్నారు.మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి వల్ల సరైన మార్గంలో వెళుతున్న అమాయకుల సైతం ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.  ఇలా మద్యం వివిధ రూపాలలో ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇక్కడ మరొక ప్రాణాన్ని బలితీసుకుంది. మద్యం మత్తులో యువకుడు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన  మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లో వెలుగులోకి వచ్చింది.



 పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ తిమ్మాపూర్ కు చెందిన ఆనంద్ అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవలే ఏదో కారణంతో భార్యతో గొడవ పడ్డాడు అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆనంద్ ఇక విచక్షణ కోల్పోయాడు. ఇక ఏం చేస్తున్నానో కూడా తెలియని పరిస్థితి లోకి వెళ్ళిపోయాడు. చివరికి మద్యం మత్తులో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగుతూ ఉండగా గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.  ఈ ఘటనతో కుటుంబంలో తీరని విషాదం విడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: