కోడలు స్నానం చేస్తుంటే బాత్రూంలో దూరిన మామ.. దారుణం..?

Suma Kallamadi
మహిళలకు సమాజంలోనే కాదు.. ఇంట్లోను రక్షణ లేకుండా పోతుంది. మహిళపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామాంధుల వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు అమ్మాయిల రక్షణ కోసం అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలను అరికట్టలేక పోతుంది. అయితే తాజాగా వావివరుసలు మరిచిన ఓ వ్యక్తి తన కుమారుడి భార్యను అత్యాచారం చేయడమే కాదు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పదే పదే అకృత్యాలను పాల్పడేందుకు ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని లఖీసరాయ్ గ్రామంలో చున్నీలాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా స్థానికంగా ఓ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన భార్య పది సంవత్సరాల క్రితమే మరణించింది. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తన ఇద్దరు కుమారులతో కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు లఖన్ కు ఔరియా గ్రామానికి చెందిన మాన్సి అనే యువతితో వివాహం జరిపించారు. అయితే చిన్న కుమారుడు కోల్ కతాలో ఉద్యోగం చేస్తుండగా, పెద్ద కుమారుడు లఖన్ తరచూ వ్యాపార పనుల నిమిత్తం పాట్నా వెళ్లి వస్తుండేవాడు.
ఇక ఈ తరుణంలో లఖన్ భార్య మాన్సిపై చున్నీలాల్ కన్నేశాడు. అంతేకాదు ఆమెతో తరచూ ద్వంద్వార్థాలతో వేధించేవాడు. గతవారం మాన్సి బాత్రూంలో స్నానం చేస్తుండగా, చున్నీలాల్ ధైర్యం చేసి లోనికి ప్రవేశించాడు. మాన్సి నోరు మూసి ఆమెపై లైంగికదాడి చేశాడు. అంతేకాదు తన కుమారుడికి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే, మాన్సి తన మామ దురాగతాలను సహించలేకపోయింది. తన భర్తకు చెబితే ఫలితం ఉండదని భావించి, తన కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: