Cooking: రుచికరమైన ఆకుకూర - చికెన్ కర్రీ ఎలా చెయ్యాలో తెలుసుకోండి....

Purushottham Vinay

చికెన్ అంటే ఇష్టపడని మాంసాహారులు వుండరు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని రుచిని మనం మాటల్లో చెప్పలేం. ఇక చికెన్ కర్రీని మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇక ఆకు కూరతో కలిపి చేసుకుంటే ఇంకా చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చికెన్ లోని ప్రోటీన్స్ అలాగే ఆకు కూరలోని విటమిన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం ఇక ఈ రుచికరమైన ఆకు కూర చికెన్ కర్రీని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....
రుచికరమైన ఆకు కూర చికెన్ కర్రీ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...
బోన్ లెస్ ఫ్రైడ్ చికెన్ - 6 పీస్
ఆకుకూర - 4 కప్స్
నూనె - ఫ్రై చేసుకోవడానికి
వెల్లుల్లి - 4 టేబుల్ స్పూన్స్ (సన్నగా కట్ చేసుకోవాలి)
నువ్వులు - 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు రుచికి సరిపడా
పంచదార- 2 టేబుల్ స్పూన్స్
రుచికరమైన ఆకు కూర చికెన్ కర్రీ తయారు చేసే విధానం...
ముందుగా డీప్ ప్రైయింగ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో స్ట్రెయినర్(జల్లు గరిట వంటిది)తీసుకొని అందులో శుభ్రం చేసుకొన్న ఆకుకూరలు వేసి 5 నిముషాలు డీఫ్రై చేసుకోవాలి.క్రిస్పీగా తయారు అయిన తర్వాత స్ట్రెయినర్ తో తీసి ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి. తర్వాత మరో పాన్ తీసుకొని అందులో కొద్ది నూనె వేసి, వేడి అయ్యాక అందులో వెల్లుల్లి మరియు నువ్వులు వేయాలి.నువ్వులు వేగిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకొన్న ఆకు కూర, పంచదార మరియు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ లో ఫ్రై చేసిన బోల్ లెస్ చికెన్ ను తీసుకొని ప్లేట్ మద్యలో పెట్టి, దాని మీద ఫ్రైచేసి, పోపు పెట్టిన క్రిస్పీ ఆకుకూరను గార్నిష్ గా వేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన క్రిస్పీ స్పినాచ్ చికెన్ రిసిపి రెడీ అయిపోయినట్లే....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: