వంటా వార్పు: సులువైన‌, రుచిక‌ర‌మైన `ఫ్రైడ్ ఇడ్లీ` మీ కోసం!!

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
ఇడ్లీలు - ప‌దిహేను
క్యాప్సికమ్ ముక్కలు - అరకప్పు
టమాటా ముక్కలు - అరకప్పు

 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
క్యాబేజీ - ఒక కప్పు

 

టమాటో కెచప్ - ఒక‌ టీస్పూన్‌
నూనె - తగినంత 
ఉప్పు - రుచికి సరిపడా
ఆవాలు - అర టీ స్పూన్‌

 

జీల‌క‌ర్ర - అర టీ స్నూన్‌
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తురుము - పావు క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా ఇడ్లీలను తీసుకుని మీడియం సైజు ముక్కలుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక‌.. ఆవాలు, జీల‌క‌ర్ర‌ వేసి అవి వేయించాలి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ఉల్లిపాయ ముక్కలు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. 

ఉల్లిపాయ ముక్క‌లు దోర‌గా వేయించుకున్న త‌ర్వాత‌ టమాటా, క్యాప్సికమ్, క్యాబేజీ ముక్కలు వేసి వేయించాలి. ఒక ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాలు వేయించి.. ఆ త‌ర్వాత కాస్త ఉప్పు, టమాటా కెచప్  కూడా వేసి వేయించాలి. అవి బాగా వేగాక ఇడ్లీ ముక్కలను వేసి బాగా క‌లిసి.. ఐదు నిమిషాల త‌ర్వాత కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్‌ చేస్తే స‌రిపోతుంది. 

అంతే ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిన‌ట్లే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ లేదా ఈవ్నింగ్ స్నాక్స్ టైమ్‌లో అయినా ఈ రెసిపీని తీసుకోవ‌చ్చు. ఇడ్లీ తిన‌ని పిల్ల‌లు, పెద్ద‌లు కూడా ఇలా చేసుకుని తింటే ఎంతో ఇష్ట‌ప‌డ‌తారు. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ ఫ్రైడ్ ఇడ్లీ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: