ప్రపంచంలో బలమైన శక్తిగా ఇండియా?

Chakravarthi Kalyan
ప్రపంచంలో మన ఆర్థిక శక్తి ఒకప్పటి కంటే చాలా మెరుగుపడింది. ఎంత మెరుగుపడుతున్న పనికిమాలిన రాజకీయ విమర్శలతో కాలం గడిపే వారు కొంతమంది ఉంటున్నారు. 1970 తో పోల్చుకుంటే భారత్ ఆర్థిక వ్యవస్థలో ఎంతో ముందుకెళ్లింది. అమెరికా, సోవియట్ యూనియన్, వెస్ట్ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ అయిదు దేశాలు మొదటి అయిదు స్థానాల్లో ఉంది. 1990 లో కూడా ఇవే దేశాలు మళ్లీ ఆర్థికంగా ముందుకు దూసుకొచ్చాయి.


అయితే 2000 సంవత్సరం నాటికల్లా అమెరికా, జపాన్,  బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ,  మొదటి అయిదు ఆర్థిక శక్తిమంతమైన దేశాలుగా నిలిచాయి. అయితే సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత ఆ ఫ్లేస్ ను బ్రిటన్ ఆక్రమించింది. వెస్ట్ జర్మనీ స్థానంలో జర్మనీ నిలుచుంది. 2010 సంవత్సరం కల్లా అమెరికా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటే చైనా రెండో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడో స్థానంలో బ్రిటన్, నాలుగో స్థానంలో జపాన్, అయిదో స్థానంలో ఫ్రాన్స్ ఉన్నాయి.


మరో వైపు 2020 నాటికి కథ మొత్తం మారిపోయింది. అమెరికా మొదటి ఫ్లేస్, చైనా రెండో స్థానం, జపాన్ మూడు, ఫ్రాన్స్ నాలుగు, బ్రిటన్ అయిదో స్థానాల్లో కొనసాగాయి. కాగా 2023 నాటికి అమెరికా మొదటి స్థానం, చైనా రెండో స్థానం, జపాన్ మూడో స్థానం, ఫ్రాన్స్ నాలుగు, ఇండియా అయిదో స్థానానికి ఎగబాకింది.


2028 సంవత్సరం నాటికి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం.. ఇండియా ఆర్థిక రంగంలో ప్రపంచంలో నాలుగో స్థానాన్ని అక్రమిస్తుందని చెప్పింది. 2050 వచ్చే సరికి ఆ స్థానం మూడు చేరుకుంటుందని చెప్పింది. అయితే అమెరికా, చైనాలతో సమానంగా పోటీపడి భారత్ నిలిచే సరిస్థితి ఉంది. ఆర్థికంగా మరింత బలంగా మారనుంది. భారత ఆర్థిక వ్యవస్థ ఒకప్పటి కంటే ఎంతో మెరుగుపడిందనడానికి ఇది ఎంతో ఉపయుక్తం. వీటిని తెలుసుకుని కొంతమంది మాట్లాడితే బాగుంటుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: