ఎవరూ వెనక్కి తగ్గడం లేదు మార్చి ఎండింగ్‌లో థియేటర్లు మండాల్సిందే..!

Amruth kumar
సంక్రాంతికి సినిమాలు పోటీ పడడం మామూలే. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ రణం ఏకంగా 2026 మార్చి నెలాఖరుకు షిఫ్ట్ అయింది. ఒకే వారంలో, ఒకే రోజు గ్యాప్‌లో రెండు భారీ అంచనాలు ఉన్న చిత్రాలు ఢీకొనబోతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' ఒకవైపు, నేచురల్ స్టార్ నాని నటించిన 'ది పారడైజ్' మరోవైపు... ఈ ఇద్దరు టాప్ హీరోల మధ్య జరగబోయే ఈ పోరు టాలీవుడ్‌లో సరికొత్త మాస్ హిస్టీరియాను సృష్టించడం ఖాయం!ఎవరూ తగ్గట్లేదు! ఏ సినిమా వెనక్కి తగ్గట్లేదు! మార్చి ఎండింగ్‌లో ఈ రెండు భారీ ప్రాజెక్టుల మధ్య నరాలు తెగే పోటీ ఉండబోతోంది.



మాస్ వర్సెస్ మాస్: రెండు డిఫరెంట్ అటెంప్ట్స్!
ఈ రెండు సినిమాలు రెండు వేర్వేరు టేస్ట్‌లలో వస్తున్నాయి. రెండూ భారీ అంచనాలు, భారీ నిర్మాణ విలువలతో వస్తుండడం విశేషం.

ది పారడైజ్ (Nani): నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల (దసరా ఫేమ్) డైరెక్ట్ చేస్తున్నాడు.రిలీజ్ డేట్: మార్చి 26, 2026.

స్పెషాలిటీ: ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కంప్లీట్ న్యూ వరల్డ్‌తో, విభిన్నమైన కథాంశంతో వస్తోంది.కీలక ఆకర్షణ: ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో నటిస్తుండడం సినిమాపై హైప్ అమాంతం పెంచింది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. నాని ఈ సినిమాను ఏకంగా 7 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండడం ఆయన దూకుడుకు నిదర్శనం.

పెద్ది (Ram Charan): గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చి బాబు సానా (ఉప్పెన ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు.రిలీజ్ డేట్: మార్చి 27, 2026.

స్పెషాలిటీ: ఈ సినిమా కూడా ఒక పీరియాడికల్ కథాంశంతో వస్తోంది. భారీ బడ్జెట్‌తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.కీలక ఆకర్షణ: జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.


ఈ రెండు ప్రాజెక్టులకు ఉన్న మరో ఆసక్తికర అంశం ఏంటంటే... ఇద్దరు దర్శకులు కూడా తమ తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్‌లు కొట్టినవారు. శ్రీకాంత్ ఓదెల 'దసరా'తో, బుచ్చి బాబు సానా 'ఉప్పెన'తో సంచలనం సృష్టించారు. ఇప్పుడు వీరిద్దరూ తమ రెండో సినిమా (ద్వితీయ విఘ్నం) ను దాటి ఎలాంటి విజయాన్ని అందుకుంటారనేది సినీ విమర్శకులకు, అభిమానులకు పెద్ద పరీక్షగా నిలవనుంది.నాని, రామ్ చరణ్ ఇద్దరూ తమ తమ సినిమాల విషయంలో ఎక్కడా తగ్గట్లేదు. రిలీజ్ డేట్లు మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో, మార్చి నెలాఖరున బాక్సాఫీస్ వద్ద ఉత్కంఠభరితమైన పోరాటం జరగడం ఖాయం.ప్రస్తుతం రెండు సినిమాల ప్రమోషన్స్ కూడా హోరాహోరీగా సాగుతున్నాయి.'పెద్ది' ఇప్పటికే పాటల రూపంలో ప్రమోషన్స్ మొదలుపెట్టగా, చరణ్ మాస్ లుక్స్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.



'ది పారడైజ్' నుంచి నాని లుక్‌తో పాటు మోహన్ బాబు విలన్ లుక్ విడుదల చేసి సంచలనం సృష్టించారు.మార్చిలో ఫ్యాన్స్‌కు పండుగే. గ్లోబల్ స్టార్ పవర్ ఏంటో చూడాలా? లేక నేచురల్ స్టార్ నాని మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటుందో చూడాలా? అనే సందిగ్ధంలో ప్రేక్షకులను ముంచెత్తబోతున్నాయి ఈ రెండు సినిమాలు. ఈ ఫైట్ తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉండాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: