ఆల్ ఈస్ సెట్..లోకేష్ పట్టాభిషేకం అప్పుడే..?
నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా నెగ్గుతామని చంద్రబాబు నమ్మకంతో ఉన్నప్పటికీ.. సీఎం చంద్రబాబు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూడరు.. ఎందుకంటే ప్రజలు ఏ క్షణంలో ఎలా మారుతూ ఉంటారో చెప్పడం కష్టమని, అందుకే ఈ ఐదేళ్ల పదవీకాలంలోనే నారా లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విషయం ఎప్పుడు జరుగుతుందని అటు టిడిపి నేతలు కార్యకర్తలు కూడా కుతూహలంగా ఉన్నారు.
అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు ఎంత ప్రణాళికతోనే ముందుకు వెళుతూ ఉంటారు. గతంలో రాష్ట్ర విజన్ కోసం 2020లో సీఎం చేస్తామని ప్రకటించారు కానీ ఆ తర్వాత ఇప్పుడు విజన్ 2047 అనే ప్రణాళికతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఒక సీఎంగా ఉండవలసిన విశిష్ట అధికారులను, అలాగే బాధ్యతలను కూడా తరచూ నారా లోకేష్ తో పంచుకుంటూ నారా లోకేష్ లో చాలా మార్పు తెచ్చారని వినిపిస్తున్నాయి. కానీ కొందరి రాజకీయ నిపుణుల అంచనాల ప్రకారం నారా లోకేష్ 2026 ఉగాది నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలనను కొనసాగించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఇదే సందర్భంలో ప్రస్తుతం రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఉన్నారు.. ఆమె పదవి కాలం కూడా పూర్తయినప్పుడు చంద్రబాబు పేరును ఎన్డీఏ ప్రభుత్వం ఆ పదవికి తీసుకోబోతుందని వినిపించాయి. అప్పుడు సీఎం కూర్చి ఖాళీ అవుతుందని ఆస్థానంలో నారా లోకేష్ ని పట్టాభి శక్తులుగా దించుతారని ప్రచారం కూడా జరుగుతొంది. మొత్తానికి నారా లోకేష్ ఈ ఐదేళ్లలోని పట్టాభిషేకం ఉంటుందని నమ్మకం అభిమానులలో చాలా బలంగా ఉన్నది. ఎందుకంటే 2024 కూటమిలో గెలిచినప్పటి నుంచి ఎక్కువగా నారా లోకేష్ పేరే వినిపిస్తోంది.అందుకే చాలామంది.. ఎక్కువగా నారా లోకేష్ చుట్టూనే తిరుగుతున్నారనే విధంగా నేతలు వినిపిస్తున్నాయి.