రవితేజ ఫస్ట్ టార్గెట్ ఆ హీరోనా.. హిట్ టాక్ వస్తే కష్టమే..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆశికా రంగనాథ్ , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ర్వండు సాంగ్స్ ను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నాము అని ఈ మూవీ బృందం వారు ప్రకటించిన ఈ సినిమాను ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనేది మాత్రం ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించలేదు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కు చాలా సినిమాలు విడుదల కాపడానికి రెడీగా ఉన్నాయి.


అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న రాజా సాబ్ మూవీ ని జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ని జనవరి 12 న తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాను జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ని జనవరి 13 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మన శంకర వర ప్రసాద్ గారు సినిమా విడుదల అయిన తర్వాత రోజే ఈ మూవీ విడుదల అవుతుంది. దానితో ఆ సినిమాకు రెండవ రోజు కాస్త కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: