సింగర్ గా మారబోతున్న బాలయ్య..ఏ హీరో కోసమో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుందని సమాచారం.ఈ చిత్రంలో బాలకృష్ణ మహారాజు పాత్రలో కనిపించనుండగా, మహారాణి పాత్రకు స్టార్ హీరోయిన్ నయనతారను ఎంపిక చేశారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతుండటం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే బాలయ్య ద్విపాత్రాభినయాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ వెల్లడించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందట, అది మరింత ప్రత్యేకంగా ఉండబోతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆ పాటను బాలకృష్ణ స్వయంగా పాడబోతున్నారని వెల్లడించడం అభిమానులను ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసింది.బాలకృష్ణ ఈ సినిమాలో సింగర్‌గా మారబోతున్నారు అని తమన్ అధికారికంగా తెలియజేశారు. ఆ పాట స్టైల్ విషయానికి వస్తే, బాహుబలి సినిమాలో దలేర్ మెహందీ పాడిన “సాహోరే బాహుబలి” పాట తరహాలో పవర్‌ఫుల్‌గా, రాజసం ఉట్టిపడే విధంగా ఉండబోతుందని ఆయన వివరించారు. ఈ విషయం తెలియడంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బాలకృష్ణ, ఇప్పుడు సింగర్‌గా మరో కొత్త అవతారంలో కనిపించబోతుండటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలయ్య బహుముఖ ప్రతిభకు ఇది మరో ఉదాహరణగా అభిమానులు కొనియాడుతున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో, భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కథ, కథనం, నటీనటుల ఎంపిక, సంగీతం అన్నీ కలిపి ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి.