కాంతార 2 ఇచ్చిన స్టార్‌డమ్ రుక్మిణి కెరీర్ నెక్ట్స్ లెవల్!
కన్నడలో పలు చిత్రాలలో నటించిన రుక్మిణి వసంత్, తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రం ద్వారా తెలుగులో పలకరించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ తో చేసిన 'మదరాసి' కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.అయితే, ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం 'కాంతార చాప్టర్ 2'. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రఖ్యాత చిత్రంలో రుక్మిణి 'కనకావతి' పాత్రను పోషించింది. యువరాణి పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, ముఖ్యంగా అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొన్ని సన్నివేశాలలో ఆమె నటన, హీరో రిషబ్ శెట్టిని కూడా డామినేట్ చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ ఒక్క సినిమాతో రుక్మిణికి వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. ఆమె ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో దృష్టిని ఆకర్షించింది.'కాంతార 2' ఇచ్చిన పాపులారిటీని సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్... ఇప్పటికే మరో భారీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం దక్కించుకుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ బిజీ షెడ్యూల్‌లో ఉండగానే, బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే లక్కీ ఛాన్స్ కూడా రుక్మిణి వసంత్‌కు దక్కినట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పందించారు."హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమే. బాలీవుడ్‌లో కూడా మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయతో త్వరలోనే ఆ పనిని కూడా ప్రారంభిస్తానని అనుకుంటున్నాను," అంటూ రుక్మిణి వసంత్ స్వయంగా ప్రకటించారు.
సౌత్ ఇండస్ట్రీలో మాదిరిగానే బాలీవుడ్‌లో కూడా రుక్మిణి వసంత్‌కు అదృష్టం కలిసొస్తుందా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఒకవేళ ఆమె నటించబోయే తొలి బాలీవుడ్ సినిమా కూడా భారీ విజయం సాధిస్తే... ఇక ఆమె రేంజ్ అమాంతం పెరిగిపోతుందని, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోతుందని అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.ఒకేసారి సౌత్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో, అటు బాలీవుడ్ చిత్రాలతో బిజీ అవుతున్న రుక్మిణి వసంత్ కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే... ఆమె రేంజ్ రాబోయే రోజుల్లో ఏ స్థాయికి చేరుతుందో ఊహించడం కష్టం. ఆమె అదృష్టం, సత్తా ఎంత బలంగా ఉన్నాయో తెలియాలంటే బాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే ఆ సినిమా ఫలితం కోసం ఎదురు చూడాల్సిందే.