గుడ్ న్యూస్: ఆ పథకాల వడ్డీ రేట్లు యథాతథం..!

Suma Kallamadi
మ‌న దేశంలో పీపీఎఫ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ లాంటి చిన్న పొదుపు స్కీమ్‌ల‌పై ఎలాంటి వడ్డీ రేట్లు మారలేద‌ని తెలుస్తోంది. జులై-సెప్టెంబర్ నెల‌ల్లో ఇప్ప‌టి వరకు వీటి వడ్డీ రేట్లలో ఏమాత్రం కూడా మార్పులేదని ప్రభుత్వం తెలిపింది. చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రతీ ఏడాదిలో మూడు నెలలకోసారి మారుస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జులై నుంచి సెప్టెంబర్ దాకా ఏ మార్పు లేకపోవడంతో ఖాతాధారులకు ఊర‌ట ల‌భించింది.
ఇక వరుసగా ఐదోసారి కూడా ఈ పథకాలపై ఎలాంటి వడ్డీ రేట్లను ప్రభుత్వం మార్చకపోవడం గ‌మ‌నార్మం. కాక‌పోతే అంతకుముందు మార్చి 31 న కేంద్ర స‌ర్కార్ చిన్న పొదుపు స్కీమ్‌ల‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాక‌పోతే మరలా ఆ నోటిఫికేషన్ ను వాప‌స్ తీసుకుంది. ఇక మనదేశంలో చాలామంది ప్ర‌జ‌లు ఇలాంటి చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌ల‌లోనే పెట్టుబడులు పెడుతూ ఉన్నారు.
ఎందుకంటే వీటిలో స్థిరమైన రాబడి వస్తుందని హామీ ఉంటుంది కాబ‌ట్టి పెట్టుబ‌డులు పెడుతున్నారు. అయితే వీటిలో కొన్ని సెక్షన్ 80 సీ క్రిందనే ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. దాంతో ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టిన ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం నుంచి మంచి హామీ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ప్ర‌జ‌లు వీటిలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటార‌ని స‌మాచారం.
ఇక 2021-22 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికంలో చాలా వ‌ర‌కు చిన్న పొదుపు స్కీమ్‌ల‌పై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం మ‌నం. జూలై-సెప్టెంబర్ నుంచి పీపీఎఫ్ స్కీమ్‌లో ఏడాదికి 7.1 శాతం వడ్డీ ఉంది. కాగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ లో మాత్రం వడ్డీ రేటు 6.8 శాతంగానే కొన‌సాగుతోంది. వేరే చిన్న పొదుపు స్కీమ్‌ల‌లో ప్రధానమైంది సుకన్య సమృద్ధి యోజన ప‌థ‌కం ఇది ఏడాదికి 7.6 శాతం వడ్డీని ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: