నియోజకవర్గానికో క్యాంపస్‌.. రేవంత్ సూపర్ ప్లాన్‌?

Chakravarthi Kalyan
ప్రతి నియోజక వర్గానికి ఒక క్యాంపస్ నిర్మిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాల్లో కలిపి ఒక వెయ్యి 974 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం గత ప్రభుత్వం విద్యకు కేవలం 6 శాతం నిధులు కేటాయించిందని, తమ ప్రభుత్వం దానిని రెట్టింపు చేసి నిధులు కేటాయిస్తామని అంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 ఎకరాల స్థలంలో కుల,మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకునేలా యూనివర్సిటీ మోడల్ లో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీ ఎస్ ను ఆదేశించారు.

ఈ క్యాంపస్‌ల కోసం పైలెట్ ప్రోజెక్ట్ గా కొండగల్ లో వంద కోట్ల రూపాయలతో క్యాంపస్ ఏర్పాటు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందుకు తగ్గ నిధులు ఎలాగైనా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.  ఉపాధ్యాయులుగా భవిష్యత్ తరాలను అద్భుతంగా తీర్చిదిద్దాలని నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: