20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను లాక్కుంటారా?

Chakravarthi Kalyan
20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి లాక్కుంటామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఖరాఖండీగా చెబుతున్నారు. దమ్ముంటే బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను టచ్‌ చేయాలని కేసీఆర్‌ సవాల్‌ విసిరిన మరుసటి రోజే జగ్గారెడ్డి ఈ కామెంట్లు చేయడం విశేషం. 20 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేల వద్ద కేసీఆర్‌ కాపలా ఉన్నా.. లాక్కుంటామన్న జగ్గారెడ్డి.. ఎంపీ ఎన్నికల్లోపే 20మంది ఎమ్మెల్యేలను తీసుకుంటామని చెప్పేశారు.
ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌ నేతలు డ్రామాలు చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ వచ్చిన నాటి నుంచి భారాస నేతలు విమర్శిస్తున్నారన్నారు. ఆరు నెలల్లో కేసీఆర్‌ సీఎం అవుతారని కేటీఆర్‌ చెబుతున్నారని.. బీఆర్‌ఎస్‌ నేతలు భయాందోళనలో ఉన్నారని జగ్గారెడ్డి అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్తారని భయపడుతున్నారని.. వలసలు ఆపుకునేందుకు జిమ్మిక్కు చేయాలని చూస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. జగన్, కేసీఆర్ బీజేపీ ఆదేశాలతోనే పని చేస్తున్నారన్న జగ్గారెడ్డి.. తెలంగాణ అభివృద్ధి చెందవద్దని కేసీఆర్‌, జగన్ కుట్ర చేస్తున్నారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: