బిగ్‌ బ్రేకింగ్‌: చిరంజీవికి పద్మవిభూషణ్‌?

Chakravarthi Kalyan
మెగాస్టార్‌ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్‌ అవార్డును ప్రకటించింది. చిరంజీవితోపాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకూ ఈ అవార్డు వరంచింది. మరో ముగ్గురికి కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించింది. 1955 ఆగస్టు 22న మెుగల్తూరులో జన్మించిన చిరంజీవి.. 2006లో పద్మభూషణ్‌ అందుకున్నారు. 1978లో 'పునాదిరాళ్లు' చిత్రంతో చిరంజీవి తెరంగేట్రం చేసి నాలుగున్నర దశాబ్దాలుగా సినీరంగానికి విశేష సేవలు అందించారు. ఇప్పటివరకు 155 చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి.. బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ ద్వారా సామాజికసేవ చేస్తున్నారు.
2006లో చిరంజీవిని ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించగా.. ఇప్పటివరకు చిరంజీవి3 నంది అవార్డులు అందుకున్నారు. తొమ్మిదిసార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు. 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న చిరంజీవికి.. 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' అవార్డు కూడా దక్కింది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి.. గతంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి సేవలందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: