వారెవా.. ఆయుర్వేదంతో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌?

Chakravarthi Kalyan
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ను ఆయుర్వేదంతో అనుసంధానం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చంటున్నారు ఆయుర్మేఘా ఆయుర్వేద ఆసుపత్రి ఎండీ చెన్నుబట్ల మూర్తి. భారతీయ ఆయుర్వేదానికి, ఆయుర్వేద వైద్యులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉందని చెన్నుబట్ల మూర్తి అన్నారు. సాధారణ వ్యాధులతో పాటు క్యాన్సర్, గుండె, మెదడు సంబంధిత వ్యాధులకు ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని మందులు ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయన్న చెన్నుబట్ల మూర్తి.. టెలీ మెడిసన్‌ సేవల ద్వారా ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్న వైద్య సేవలు పొందవచ్చు అని పేర్కొన్నారు.

రోగికి కేవలం రెండు నిమిషాల్లోనే స్టెతస్కోప్‌తో గుండె పనితీరుతో పాటు 2డీ ఇకో రిపోర్ట్‌ను అందించవచ్చని చెన్నుబట్ల మూర్తి  అన్నారు. బ్లడ్‌ ప్రెషర్, నాడీ స్పందనలు ఇలా ప్రతి విషయంలో టెక్నాలజీకి అనుసంధానం చేసి ఆయుర్వేద వైద్యం విధానంలో చికిత్స అందించనున్నట్లు చెన్నుబట్ల మూర్తి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: