ఇక అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే రాజ్యమా?

Chakravarthi Kalyan
హైదరాబాద్ ఈవీ వాహనాలకు కేంద్రంగా మారబోతోందట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నో ఈవీ కంపెనీలు పెట్టుబడులను పెడుతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ హైటెక్ లో హైదరాబాద్ ఈ మోటార్ షో 2023 ప్రారంభమైంది. ఈ షోలో పలు ఈవీ కంపెనీల స్టాల్ల్స్ ఉన్నాయి. ఎలెక్ట్రిక్ బైక్స్ , కార్స్, కమర్షియల్ వాహనాలు, టైర్ కంపెనీస్, మోటార్ కంపెనీస్, ఈబీ బ్యాటరీ, ఈవి స్టార్టప్ కంపెనీలు ఈ షో పాల్గొన్నాయి. హైదరాబాద్ ఈ మోటార్ షో లో దేశీయ కంపెనీల ఎలెక్ట్రిక్ వెహికిల్స్ తో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇది మొదటి అడుగుమాత్రమే.. రానున్న రోజుల్లో ఈ రంగ అభివృద్ధి మరింత గా చెడుతుందన్నారు. ఈవీ బ్యాటరీ తయారీ కంపెనీ అమర్ రాజా సంస్థ ఇప్పటికే తమ మాన్యుఫ్యాక్టరింగ్ యూనిట్ ఏర్పాటు ముందుకు వచ్చిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: