జగమంత జగన్ (అమ్మఒడి): ఏపీ విద్యావ్యవస్థ.. దేశానికే గర్వకారణం..!

Divya
•జగనన్న అమ్మఒడి దేశానికే రోల్ మోడల్
•పేదవాడి కల ఉన్నత విద్య
•ఇది కదా రాష్ట్రాభివృద్ధి అంటే..
(అమరావతి - ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి నిన్నటితో ముగిసింది. గత రెండు మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి ఎంతలా భగ్గుమనిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో నిన్న పోలింగ్ జరుగుతున్న సమయంలో వాడి వేడిగా గొడవలు కూడా జరిగాయి.. కొంతమంది ఓటర్లు గాయాల పాలయ్యారు.. ఇకపోతే గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి నిన్నటితో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ పార్టీ అధినేతలలో మరింత బలంగా పెరిగిపోతుంది..
ఇకపోతే ఈసారి మళ్లీ మేమే వస్తామంటూ అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.. అందుకు కారణం వీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అని మరొకసారి గుర్తు చేశారు.. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో అమలు పరిచిన పథకాలు అన్నిటిని కూడా ఆయన సఫలం చేయడంలో నూటికి 99% విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మళ్ళీ ఆయనను నమ్మి అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ప్రజలను మరింత ప్రభావితం చేసిన పథకాలు ఏవైనా ఉన్నాయంటే అందులో మొదటిది అమ్మఒడి అని చెప్పాలి.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ అమ్మఒడి పథకం దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది..
ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్ కి వెళ్లి చదువుకోవాలనే ఆలోచన చేసిన జగన్ ప్రభుత్వం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని చెప్పవచ్చు. విద్య,  వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు.. అనేక సంస్కరణలు తీసుకొచ్చి.. పాలనలో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా ప్రత్యేకంగా కనిపించారు. ఇదే సమయంలో ప్రవేశపెట్టిన అమ్మబడి కూడా ప్రజలలో మంచి అభిప్రాయాన్ని కలిగించింది.. అయితే ప్రతిపక్షాలు మాత్రం సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు పంచుతున్నారు.. కానీ అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఆరోపించడంతో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానమిస్తూ.. అమ్మ ఒడి పథకం అనేది ఒక గొప్ప కార్యక్రమం.. నాకు సంతృప్తిని ఇచ్చిన పథకం .. తొలుత పేద విద్యార్థులను స్కూళ్లకు అలవాటు చేస్తున్నాము.. అమ్మ ఒడి ద్వారా డబ్బులు ఇవ్వకుంటే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.. దీనివల్ల చాలామంది పిల్లలు బడి మానేసే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఆర్థిక సమస్య రాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు నగదు అందజేస్తున్నాను..
అంతేకాదు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాము.. పైగా ఇప్పటివరకు లేని ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతూ.. వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులపై మనం చేస్తున్న ఈ ఖర్చు భవిష్యత్తులో రాబోయే 15 ఏళ్లకు కచ్చితంగా ఫలితాలు లభిస్తాయి.. ఇప్పుడు మనం అందించే నాణ్యమైన విద్యతో బయటకు వెళ్లిన పిల్లలు పెద్దపెద్ద యూనివర్సిటీలో పట్టాలు పొంది మంచి స్థితిలోకి చేరుకుంటారు. ఇక పేద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్తే వారి కుటుంబం ఆర్థిక పరిస్థితి మరింత పెరుగుతుంది.. ఇదే కదా రాష్ట్ర అభివృద్ధి అంటే.. మేము పెట్టిన ప్రతి పథకం ప్రజలకు మంచి చేయడమే కాదు రాష్ట్ర అభివృద్ధికి కూడా పునాది వేస్తోంది అంటూ స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి.. మొత్తానికైతే ఈ పథకం ద్వారా ఏపీ విద్యావ్యవస్థ రూపురేఖలు మారడమే కాదు భారతదేశ యొక్క అభివృద్ధికి కూడా కారణం అని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: