జగమంతా జగన్ : ఆ నాడు - నేడే.. నేడు వైసీపీని గెలిపించబోతుంది?

praveen
పేదలు చదువుకుని వికాసవంతులు అయితే ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించేవారు ఎక్కువవుతారు.. ఏ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ ను బాగు చేయించదు అనే డైలాగ్ అటు సినిమాలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇక రియల్ లైఫ్ లో పరిస్థితులు చూస్తే  కూడా ఇది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా అటు ప్రభుత్వ బడులను బాగు చేయించడానికి ఇక నాణ్యమైన విద్యను అందించడానికి పెద్దగా కృషి చేయదు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత మాత్రం ఎవరు చేయని పనిని చేశాడు. నేటి రోజుల్లో తమ పిల్లలు బాగా చదువుకోవాలంటే.. ప్రైవేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు కట్టి చదివించుకోవడం తప్ప మరో గత్యంతరం లేని నేటి రోజుల్లో.. పేద ప్రజలు ఎంతో కష్టపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు.

 కానీ పేదలకు అలాంటి బాధలు లేకుండా చేశాడు జగన్. ఏకంగా ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ పాఠశాలల్లా కాదు  అంతకుమించి అనేలా మార్చేశారు. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలను ప్రవేట్ పాఠశాలల కంటే సుందరంగా తీర్చిదిద్దాడు. 2019 నవంబర్ 14న నాడు నేడు పథకాన్ని ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. సమాజ పురోగతిలో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని బలంగా నమ్మిన జగన్ పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నాడు. అందులో భాగంగానే నాడు నేడు పథకం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాడు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకువచ్చి.. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించే తల్లిదండ్రులు సైతం పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్చే విధంగా మార్పు తీసుకొచ్చాడు. ఇలా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆ నాడు నేడు కార్యక్రమమే.. ఇక నేడు జగన్ మరోసారి ఘనవిజయం సాధించడానికి కారణమైంది అని రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు.
 ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు అనర్కళంగా ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రి మాకెందుకులేడు అని అనుకునే విధంగా ప్రభుత్వ బడుల్లో విద్యాబోధనలో మార్పులు తీసుకువచ్చాడు  జగన్. ఇలా పేద ప్రజలు చదువుకొని వికాసవంతులు అయితేనే సమాజం బాగుపడుతుంది అని నమ్మిన జగన్ సిద్ధాంతమే ఇక ఇప్పుడు ఆయనను భారీ మెజారిటీతో మరోసారి గెలిపించబోతుందని వైసీపీ నేతలు అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: