ఏపీ: ఆ కులాల ఓట్లు.. వైసీపీకా.. కూటమికా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఓటింగ్ నిన్నటి రోజున పూర్తి అయ్యింది.. అయితే ఈసారి ఎన్నికలు కూడా అటు రెండు పార్టీలకు చాలా కీలకంగా ఉన్నాయి.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో కమ్మ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు మాత్రం చాలా కసితో ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా కూడా వచ్చి మరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక పక్కన చంద్రబాబు ను ఒన్ చేసుకున్న కమ్మ సామాజిక వర్గంలోని అత్యధికులు.. అలాగే పవన్ కళ్యాణ్ ను ఒన్ చేసుకోవడానికి  వచ్చారా లేకపోతే.. ఒన్ చేసి తీరాలని వచ్చారా అనే విషయం కాపు సామాజిక వర్గం లో కొన్ని మిలియన్ డాలర్ల ప్రశ్న.

జగన్ వచ్చినప్పటి నుంచి ఈ రెండు సామాజిక వర్గాలు ఇటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ.. విమర్శించడం లేదా.. కాపు సామాజిక వర్గపు ఉనికికి.. ప్రశ్నార్ధకమని కూడా చెప్పవచ్చు. మరి కాపు సామాజిక వర్గపు యువత పెద్ద ఎత్తున చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి.. ఉద్యోగాలు చేసే వాళ్లదాకా.. తరలివచ్చారు.. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ను జైల్లో పెట్టడంతో తెలుగుదేశం మూలాలను దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో అటు చూసి చూడనట్లు టిడిపి పార్టీ వదిలేయడంతో.. 25 ఏళ్ల నుంచి .. ఇక లేదని.. 2004, 2009,2014,2019,2024 ఇలా టోటల్గా అక్కడ లేకుండానే పోయింది.. ఇప్పుడు కూడా మనం పట్టించుకోకపోతే.. కమ్మ సామాజిక వర్గం పట్టు కోల్పోతుందని బాధపడ్డ అటువంటి.. భయపడినటువంటి.. కమ్మ సామాజిక వర్గం వారు.. పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈ ఓట్లన్నీ కూడా ఎక్కువ శాతం యాంటీ జగన్ కే పడినట్లుగా తెలుస్తోంది. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ కాపు సామాజిక వర్గం జగన్ కి ఆపోజిట్ గా వేశారా.. అనేది తెలియాలి. రెడ్డి సామాజిక వర్గం కొంతమేరకు అయితే వచ్చినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: