'రామోజీరావు' అరెస్ట్ విషయంలో జగన్ పప్పులు ఉడకలే...?

FARMANULLA SHAIK
ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రామోజీరావు గారు అస్తమించిన సంగతి తెల్సి షాక్ కి గురి అయ్యారు.మీడియా మొఘల్,వ్యాపార దిగ్గజం అయినా రామోజీరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఉదయం 4.50కి తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల ఎంతో మంది రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ మోహనరెడ్డి రామోజీరావు గారిని వ్యక్తిగతంగా బాగా ఇబ్బంది పెట్టారని మీడియా ద్వారా అందరికి తెల్సిందే.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు ఆయనకు దగ్గరగా ఉన్న వ్యక్తులను సైతం రాజకీయంగా టార్గెట్ చేసారు. దాంట్లో భాగంగానే ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు కూడా ఇబ్బందులు తప్పలేదు. అయితే చివరకు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది.అయితే ఆయన్ను అరెస్ట్ చేయాలంటే అది చట్ట పరంగా చూసుకుంటే జగన్ ఆయన నివాసం ఉండే తెలంగాణ సీఎంతో చర్చించాలి.దానికి జగన్ చేసిన ప్రయత్నాలను ఆనాటి సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు.ఒక చిన్న స్థాయినుండి అంచలంచెలుగా ఎదిగిన రామోజీరావు గారు ఒక్క మీడియా రంగంలోనే కాదు అనేక వ్యాపార రంగాల్లో అనేక మందికి జీవనాధారం కల్పించారు. అలాంటి వ్యక్తిని జీవిత చివరిదశలో అరెస్ట్ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది.అయితే ఆయన అరెస్ట్ కోసం కేసీఆర్ సహకారం కూడా జగన్ కోరినట్లు తెలుస్తుంది.అయితే దానికి ఒప్పుకొని కేసీఆర్ చట్టప్రకారం పోవాలని అన్నారనే విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ మీడియాలో చెప్పిన సంగతి తెల్సిందే.ఆయనకు ప్రస్తుతం ,పెద్దాయనకు 85 ఏళ్లు అని, క్యాన్సర్ తో బాధపడుతున్నారని ,ఆయనపై కక్షపురిత చర్యలు వద్దని ,కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసి జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయానికుండా అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: