పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ..?

Chakravarthi Kalyan
ఆర్థిక సంక్షోభం దిశగా పయనిస్తున్న పాకిస్తాన్ కు ఇప్పుడు మరో ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లోనే ఉంచుతున్నట్లు ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్రకటించింది. పాకిస్తాన్‌ ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎఫ్‌ఏటీఎఫ్‌ సంస్థ ప్రకటించింది. త్రస్థాయి పరిశీలన తర్వాతే గ్రే లిస్ట్ నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఈ గ్రే లిస్ట్‌లో ఉంటే అంతర్జాతీయ నిధులు పొందటం పాకిస్తాన్‌కు కష్టం అవుతుంది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను ఎఫ్‌ఏటీఎఫ్‌
బ్లాక్‌ లిస్ట్‌లో ఉంచుతోంది.
కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌ పేరు ఈ గ్రే లిస్టులోనే ఉంటోంది. దీని వల్ల పాకిస్తాన్‌కు అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్‌కు ఇది నిజంగా ఎదురు దెబ్బే.. ఇప్పటికే పాకిస్తాన్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు బాగా తగ్గిపోయాయి.. చివరకు టీ దిగుమతి చేసుకునేందుకు కూడా పాక్ వద్ద నిల్వలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: