గుడ్‌ న్యూస్‌: ఏపీకి రూ.5,500 కోట్ల పరిశ్రమ?

Chakravarthi Kalyan
ఏపీకి ఓ గుడ్ న్యూస్‌.. ఏపీకి మరో కొత్త పరిశ్రమ రాబోతోంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో హై ఎండ్‌ అల్యుమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. నాల్కో, మిధాని సంయుక్త సంస్ధ ఉత్కర్ష అల్యుమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ ఇక్కడ పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏడాదికి 60,000 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీతో   5,500 కోట్లతో ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, మిథానీ సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝ ఈ వివరాలు తెలిపారు.

రెండు నుంచి రెండున్నరేళ్ళలో ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తారు. దాదాపు 750 నుంచి వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు రాబోతున్నాయి. ప్రాజెక్ట్‌ ఏర్పాటులో ఎదురవుతున్న సమస్యలను వారు సీఎం దృష్టికి  తీసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: