జగమంత జగన్‌: 110-120.. వైసీపీ గెలుపు లెక్కలివే?

Chakravarthi Kalyan
పోలింగ్‌ తర్వాత అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికలతో వైసీపీ ఖుషీగా ఉంది. కొంత మెజార్టీ తగ్గినా కనీసం 110 నుంచి 120 స్థానాల్లో తమ గెలుపు ఖాయమని వైసీపీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో కొంతమేర తమకు ప్రతికూలత ఎదురైనా..  యువత నుంచి కొంతమేర ఓట్లు తగ్గినట్టు కనిపించినా.. ఓవరాల్‌గా జగనే మళ్లీ రావాలి అన్న పాజిటివ్‌ ప్రచారం బాగా జరిగిందని..అది వర్కవుట్ అయ్యిందని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

దీనికి తోడు వైసీపీ నేతలు పోలింగ్ శాతలను కూడా విశ్లేషిస్తున్నారు. 2019లో 79.64 శాతం పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. అయితే అదంతా ప్రభుత్వ వ్యతిరేకతగా భావిస్తున్న వైసీపీ నేతలు 2024 ఎన్నికలకు సంబంధించి సోమవారం నమోదైన భారీ పోలింగ్‌ తమ ప్రభుత్వంపై సానుకూలతగా చెబుతున్నారు.  2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందని.. కానీ ఈసారి చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత కనిపించిందని చెబుతున్నారు. ఆ కారణంగానే ఇంత భారీ పోలింగ్‌లో కనిపిస్తోందని అంటున్నారు.

నిన్న సాయంత్రం 5 గంటలకే 68 శాతం పోలింగ్‌ ఏపీలో నమోదైంది. రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగిన పోలింగ్‌ 80 శాతం దాటుతుందని ఎన్నికల సంఘం అధికారులు అంచనాకు వచ్చారు. సాధారణంగా ఇలా భారీగా పోలింగ్‌ జరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకతగా భావిస్తారు. కానీ.. ఈసారి నమోదైన భారీ పోలింగ్‌ వైసీపీ ప్రభుత్వానికి సానుకూలమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే భారీ ఓటింగ్‌ నమోదు అవుతుంది. అయితే.. జనం గట్టిగా ఈ ప్రభుత్వమే కావాలనుకున్నప్పుడు కూడా భారీగా ఓటింగ్‌కు తరలివస్తారన్నది వైసీపీ నేతల విశ్లేషణ.

అందుకే అధికారంలో ఉండీ ప్రతిపక్షం కంటే అన్యాయమైన పరిస్థితిని ఈసీ కారణంగా ఎదుర్కొన్నా తమదే గెలుపని లెక్కలు వేసుకుంటున్నారు. సోమవారం ఒక్కరోజునే ఎన్నికల సంఘానికి వైసీపీ  80 ఫిర్యాదులు చేసింది. ఏదేమైనా 110 నుంచి 120 సీట్లకు ఏమాత్రం తగ్గేది లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: