అమ్మ బాబోయ్.. ఈ ఏజ్ లోను సుమ రాజీవ్ ను చూడగానే అలా చేస్తుందా..?

murali krishna
యాంకర్ సుమ కనకాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాలెంట్ కల్గిన ఈ ముద్దుగుమ్మ.. బుల్లితెరపై మహారాణిలా వెలుగొందుతోంది.ముఖ్యంగా సినిమా ఈవెంట్లతో పాటు పలు షోలు చేస్తూ తెగ రచ్చ చేసే ఈమెలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉన్నట్లు తాజాగా తెలిసింది. ముఖ్యంగా తాను ఎక్కడికైనా వెళ్లి వచ్చినా, ఆయన కనిపించిన వెంటనే తాను అలా చేస్తానంటూ ఒ ఫొటో చూపించింది. ఇది చూసిన వాళ్లంతా తెగ సిగ్గు పడిపోయారు. వాళ్లు భార్యాభర్తలే అయినా ఇలా అందరిలో చెప్పేసరికి అంతా షాక్ అవుతున్నారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలుగు బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా తన హవాను చూపిస్తోంది యాంకర్ సుమ. అద్భుతమైన అందం, అంతకు మించిన మాటలతో అందరినీ మెస్మైరైజ్ చేస్తూ.. ఎన్నో ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది. ఒకపక్క గ్లామర్‌తో కొత్త కొత్త యాంకర్లు పోటీ ఇస్తున్నా... తన ప్రత్యేకమైన నైపుణ్యంతో వాళ్లందరినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలోనే మరిన్ని షోలు, ఈవెంట్లు, సినిమా ఫంక్షన్లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే ఇటీవలే ఓ సినిమా కూడా చేసింది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టి వరుసగా వీడియోలు విడుదల చేస్తుంది.ఇక కెరియర్ పరంగా టీవీలీ షోలు చేస్తూ.. పిల్లలను చూసుకోకుండా ఉండడం కంటే ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటుందట. అందుకే ఒక్క సుమ అడ్డా షో తప్ప మరేవీ చేయకుండా.. యూట్యూబ్ పై ఫోకస్ చేసిందట. ఇక మిగతా సమయాల్లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లకు మాత్రమే వెళ్తుందట. అయితే తాజాగా సుమ అడ్డా షోకు.. భజే వాయు వేగం సినిమా టీం వచ్చింది. ఇందులో హీరోహీరోయిన్లతో పాటు దర్శక, నిర్మాతలు కూడా వచ్చారు. అయితే వారి సినిమాను ప్రమోట్ చేస్తూనే వారితో చక్కగా గేమ్స్ ఆడింది సుమ. అలాగే విపరీతమైన పంచులు వేసింది.ఈక్రంలోనే తమ మనసులో ఏం ఉందో అని చూపించే ఈ మిషన్ ను తీసుకు వచ్చింది. కళ్లు మూసుకుని దానిపై చేయి పెడితో వారి మనసులో ఏం ఉందో తెరపై చూపిస్తుందీ మిషన్. అయితే ముందుగా దీనిపై ప్రొడ్యూసర్ చేయి పెట్టించగా... ఫస్ట్ నైట్ డెకరేషన్ రూంను చూపించారు. ఇది చూసిన నిర్మాత తెగ సిగ్గు పడిపోతూనే.. ఇదెక్కడ ఉందో చెబితే నేను నిజంగానే వెళ్తాను కదా అంటూ అనగా.. అంతా నవ్వారు. ఇక ఆ తర్వాత భజే వాయు వేగం సినిమా హీరో కిరణ్ అబ్బవరం.. చేయి పెట్టాడు. ఈక్రమంలోనే సుమ.. కాబోయే భార్య మొహం కనిపిస్తే ఓకే కానీ ఇంకేం కనిపించినా ఇక మీరు ఇంటికి వెళ్లలేరు అంటూ చెప్పుకొస్తుంది. ఇంటికెళ్లాలంటే భయమే అంటూ కిరణ్ కామెడీ చేస్తాడు.ఇలా హీరో చేయి పెట్టగానే.. వందలాది మంది అమ్మాయిలు ఉన్న ఫొటో కనిపిస్తుంది. ఇది చూసి అంతా షాక్ అవ్వగా.. సుమ మాత్రం నీ మనసులో ఇంత మంది అమ్మాయిలు ఉన్నారా.. రహస్యను ఎక్కడ ఉంచావు మరి అంటూ అడుగుతుంది. దానికి కిరణ్ నవ్వుతాడు. ఇప్పుడు మీరు పెట్టండి అంటూ చెబుతాడు. అలా సుమ చేయి పెట్టగానే.. తన కొడుకు రోషన్ కనకాల హీరోగా చేసిన బబుల్ గమ్ సినిమా పోస్టర్ కనిపించింది. అందులో హీరోయిన్ హీరో చెంపను కొరికేస్తూ కనిపిస్తుంది. అయితే తాను తన భర్తను చూడగానే అలాగే చేస్తారంటూ హీరో చెప్పాడు. దానికి సుమ తెగ సిగ్గుపిడపోతూనే కాదని చేయి ఊపింది. కానీ అందరూ అదే నిజం అంటూ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: