పవన్ మీట్‌తో బాబీ నెక్స్ట్ ప్లాన్ క్లియర్?..మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వస్తుందా?
పవన్ కళ్యాణ్‌ను కలిసిన తర్వాత బాబీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పెట్టిన పోస్ట్ ప్రతి మెగా అభిమాని గుండెను తాకుతోంది. "ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం.. ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు" అని బాబీ పేర్కొన్నారు.రాజకీయాల్లో ఆస్తులు పెంచుకున్న వారిని చూశాం కానీ, తనకున్న సుఖాలను, సౌకర్యాలను వదులుకుని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న పవన్ తనకు ఒక శిఖరంలా కనిపించారని బాబీ ఎమోషనల్ అయ్యారు. జ్ఞానం కోసం అడవి పట్టి
ఈ భేటీ వెనుక ఒక బలమైన కారణం ఉందని ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘మెగా 158’ (చిరు బాబీ 2) సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం ఏప్రిల్ 11న జరగనుందని సమాచారం. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని తన ‘గబ్బర్ సింగ్’ హీరో పవన్‌ను ఆహ్వానించడానికి బాబీ వెళ్లినట్లు తెలుస్తోంది. కేవీఎన్ నిర్మాత ఎన్.కె. లోహిత్ కూడా పవన్‌ను కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. "అసలైన 'OG' పవన్ కళ్యాణ్ గారితో సమయం గడపడం ఎంతో స్ఫూర్తిదాయకం. కట్టె కాలేవరకు ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను" అని లోహిత్ పోస్ట్ చేశారు.
సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2016 ఏప్రిల్ 8న పవన్ - బాబీ కాంబోలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలైంది. ఆ సినిమాకు పవనే కథ అందించడం విశేషం. పదేళ్ల తర్వాత అదే రోజున వీరిద్దరూ కలవడం యాదృచ్ఛికమే అయినా, అది ఫ్యాన్స్‌కు మాత్రం డబుల్ ధమాకా.చిరంజీవి గారి ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, త్వరలోనే బాబీ సినిమా పట్టాలెక్కనుంది. ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ కాంబో, ఇప్పుడు మరోసారి ‘మెగా’ హిట్ కొట్టడానికి రెడీ అవుతోంది.