జగమంత జగన్ : భారీ శాతం ఓటింగ్ జగన్ కి ప్లేస్..?

Pulgam Srinivas
నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీలోకి దిగింది. వైసీపీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి మేము ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేశాం. రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ఇచ్చాము. మహిళలను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఎంతో కష్టపడ్డాం. నాడు నేడు అనే కార్యక్రమంతో స్కూల్స్ ని ఆధునికరించి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ చేశాం.

ఇలాగే మరెన్నో గొప్ప గొప్ప పథకాలను ప్రజలకు ముందుకు తీసుకువచ్చాం. అలాగే ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాం. అంత మంచి చేసిన మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒంటరి గానే వస్తాం మరోసారి గెలుస్తాం అని చెబుతూ వచ్చాడు. ఇక టీడీపీ , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులో భాగంగా బరిలోకి దిగాయి. ఇకపోతే నిన్న దేశ వ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినంత ఓటింగ్ శాతం మరే రాష్ట్రంలో కూడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగిన ఎలక్షన్ లలో 78.25 శాతం ఓటింగ్ జరిగింది.

ఇక పోయిన సారి కంటే ఈ సారి భారీ శాతం ఓట్లు పోల్ కావడంతో ఇది జగన్ విజయాలకు సంకేతం అని ఈ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఎందుకు అంటే జగన్ ఒక్కడే ఒంటరిగా వస్తున్నాడు. టీడీపీ , జనసేన , బీజేపీ మూడు పార్టీలు కలిసి పొత్తుగా బరిలోకి దిగాయి. అలా పొత్తుగా రావడంతో వారికి ఓట్లు అధికంగా వస్తే జగన్ ఓడిపోతాడు అనే ఉద్దేశం తోనే జనాలు భారీగా తరలి వచ్చి ఓట్లను వేసినట్లు దాని ద్వారానే ఇంత శాతం ఓటింగ్ నమోదు అయినట్లు వైసీపీ నేతలు , కార్యకర్తలు చెబుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: