దోస్త్‌ నుంచి దుష్మన్‌గా? కళ్యాణ్ మాస్టర్ స్ట్రోక్‌తో భరణి అవుట్! బిగ్ బాస్ 9లో కెప్టెన్సీ టాస్క్‌లో ఊహించని మాస్ ట్విస్ట్!

Amruth kumar
బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలేకి రోజులు దగ్గర పడుతుండటంతో.. హౌస్‌లో టెన్షన్ తారాస్థాయికి చేరింది! ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌తో.. కంటెస్టెంట్స్ మధ్య ఉన్న స్నేహాలు, శత్రుత్వాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా, ఒకవైపు టికెట్ టు ఫినాలే కోసం హోరాహోరీ పోరు జరుగుతుంటే, మరోవైపు భరణికి, కళ్యాణ్ఇచ్చిన ఊహించని 'మాస్ షాక్' ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


బిగ్ బాస్ ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఫిజికల్ టాస్క్ కాకుండా.. పూర్తిగా మెదడుకు పదును పెట్టే మెంటల్ టాస్క్ను ఇచ్చాడు. ఈ కెప్టెన్సీ టాస్క్‌లో విజేత ఎవరో తేల్చడానికి హౌస్‌మేట్స్‌ను గార్డెన్ ఏరియాలో కూర్చోబెట్టి, వారి కళ్లకు గంతలు కట్టి, నెత్తిపై బల్బులు ఉంచారు.గేమ్ రూల్స్: బజర్ మోగినప్పుడు కళ్ల గంతలు తీసి.. కెప్టెన్సీ రేస్‌లో ఉన్న మరో సభ్యుడిని ఎంచుకుని, వారి లైట్‌ను ఆఫ్ చేయాలి. అంటే, ఈ గేమ్ పూర్తిగా ఎవరిపై ఎవరికి విశ్వాసం ఉంది, ఎవరు దుష్మన్‌గా కనిపిస్తున్నారు అనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది.

భరణి vs కళ్యాణ్: ఊహించని టర్న్!

ఈ గేమ్ ఆరంభం నుంచీ భరణి ఈ సీజన్‌లో అత్యంత బలమైన కంటెండర్‌గా, ముఖ్యంగా ఫిజికల్ టాస్క్‌లలో మొనగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే కెప్టెన్సీ రేస్‌లో భరణి గెలవడం ఖాయమని అంతా అనుకున్నారు.కానీ, ఈ మెంటల్ గేమ్‌లో కళ్యాణ్ పడాల (ఆర్మీ సోల్జర్) తన మెదడుకు పదును పెట్టి, వ్యూహాత్మకంగా ఆడాడు. కెప్టెన్సీ రేస్‌లో భరణి ఎలిమినేట్ కావడంలో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రోమోను బట్టి చూస్తే.. భరణికి ఊహించని షాక్ ఇచ్చి, అతడిని కెప్టెన్సీ రేస్ నుంచి పక్కకు తప్పించింది కళ్యాణేనని స్పష్టమవుతోంది. 'దోస్త్' అనుకున్న వాడే 'దుష్మన్'గా మారితే ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.



చివరికి, కెప్టెన్సీని దక్కించుకోవడానికి కళ్యాణ్ పడాల తన స్మార్ట్‌నెస్, వ్యూహంతో విజయం సాధించినట్లు తెలుస్తోంది. మరి భరణికి కళ్యాణ్ ఎందుకు ఈ షాక్ ఇచ్చాడు? దీనిపై హౌస్‌లో ఎలాంటి మాస్ గొడవ జరగబోతోంది? అనేది రాత్రి ఎపిసోడ్‌లో చూడాలి!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: