జగమంత జగన్ : మ్యాజిక్ ఫిగర్ లో సీమ నుంచి సగం సీట్లు.. వైసీపీకి తిరుగులేదుగా!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ లో సీమ నుంచి సగం సీట్లు వైసీపీకి రానున్నాయని తెలుస్తోంది. రాయలసీమ నుంచి కనీసం 44 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మిగతా 44 సీట్లను కోస్తా జిల్లాల నుంచి సాధించడం వైసీపీకి చాలా సులువు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
120 నుంచి 130 స్థానాల్లో వైసీపీకి విజయం పక్కా అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆంధ్రలో పెరిగిన పోలింగ్ శాతం జగన్ గెలుపునకు సూచన అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో కూటమి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలపై అంతోఇంతో ఆశలు పెట్టుకుంది. అనంతపురంలో నాలుగు నుంచి ఐదు స్థానాల్లో కూడా కూటమి గెలవడం కష్టమని టాక్ వినిపిస్తోంది.
 
గతంలో అనంతపురంలో కూటమికి గట్టి పునాదులు ఉన్నాయి. 2014 ఎన్నికల వరకు టీడీపీ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లలో విజయం సాధించడం జరిగింది. 2019 ఎన్నికల్లో మాత్రం కూటమి కంచుకోటలు బద్దలు కాగా ఈ ఎన్నికల్లో సైతం అలాంటి పరిస్థితే ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అనంతపురంలో టీడీపీ పైచేయి సాధించే ఛాన్స్ అయితే లేదని భోగట్టా.
 
ఈ ఎన్నికల్లో తమ పార్టీదే విజయం అని పచ్చ పత్రికలు ప్రచారం చేసుకుంటున్నా వాస్త పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. ఓటింగ్ సరళి ప్రభుత్వ అనుకూలతకే పట్టం కట్టిందని విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా ఫలితాల కోసం అన్ని పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు ఎక్కువ సమయం ఉండటంతో నేతలలో టెన్షన్ మరింత పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని ఎక్కువమంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: