సీఎం రేవంత్ కు షాక్.. సైలెంట్ గా ఓట్లన్నీ ఆ పార్టీ వైపేనా.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  ఏకధాటిగా విజయం సాధించింది. ఈ పార్లమెంటు ఎలక్షన్స్ లో మాత్రం రిజల్ట్ చాలా రివర్స్ అయిపోయింది.  17 పార్లమెంటు స్థానాల్లో దాదాపుగా పదికి పైనే మేము గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆయన అనుకున్న దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది.ఇక కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటినుంచి బిఆర్ఎస్ పూర్తిగా చతికిల పడిపోయింది. కనీసం ఏ ప్రాంతంలో కూడా పోటీ ఇచ్చే పరిస్థితులు లేకుండా పోయింది. 

అనూహ్యంగా బీజేపీ పుంజుకుంది. 17 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా తయారయింది. ఇక చాలా ప్రాంతాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కి వెళ్తుందని కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కు సంబంధించి చాలా ప్రాంతాల్లో గెలవదని తెలిసి చాలా ఓట్లు పువ్వు గుర్తుకు ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా  చాలామంది బీఆర్ఎస్ నాయకులు మనం గెలవకపోయినా పర్లేదు కానీ కాంగ్రెస్ ను మాత్రం ఓడించాలి అనే నినాదంతో ముందుకు వెళ్లారట. అంతేకాకుండా  యువత చాలామంది మోడీ వైపు మళ్లారని, కొత్తగా ఓట్లు వచ్చిన వారంతా మోడీకే ఓటు వేసినట్టు తెలుస్తోంది.

వారు ఓటు వేయడమే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా సైలెంట్ గా  మోడీకి వేయాలని  మోటివేట్ చేసినట్టు  సమాచారం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు బీజేపీ వైపు మళ్ళినట్టు సమాచారం. బయటకి కనిపించకుండా చాలామంది సైలెంట్ గా ఓట్లు అన్ని కమలం గుర్తుకే  వేశారట. ఈ తరుణంలో పార్లమెంటు ఎలక్షన్స్ లో తెలంగాణలో బిజెపి హవా కొనసాగేలా కనిపిస్తోంది. ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్ లో బిజెపి హవా చూపిస్తే మాత్రం పూర్తిగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయినట్టే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి జూన్ 4న ఎవరి భవితవ్యం ఎలా ఉంటుందనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: