జగమంత జగన్‌: జగన్‌ను గెలిపించబోతున్న 5 ప్రధాన కారణాలు?

జగన్‌కు పట్టం కట్టిన సంక్షేమం, పేదల పక్షపాతం
సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థలతో చెరగని ముద్ర
కలసి వచ్చిన పోల్‌ మేనేజ్‌మెంట్‌, చంద్రబాబుపై అపనమ్మకం
ఏపీలో గెలుపెవరిది.. ఎన్నికల పోలింగ్‌ తర్వాత ఏపీ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే.. గతమంత ఊపుతో కాకున్న మళ్లీ కంఫర్టబుల్ మెజార్టీతో వైసీపీ పీఠం మరోసారి ఎక్కబోతోందని ఇండియా హెరాల్డ్‌కు అందుతున్న గ్రౌండ్‌ రిపోర్టులు చెబుతున్నాయి. పాత మెజార్టీ కొంత వరకు తగ్గినా కంఫర్టబుల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వైసీపీ అగ్రనేతలు కూడా  ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్‌ను మళ్లీ గెలిపించబోతున్నది ఏంటి.. ఏ కారణాలు మళ్లీ జగన్‌కు పట్టం కట్టేందుకు కారణమయ్యాయో చూద్దాం.

జగన్‌ను గెలిపించబోతున్న అంశాల్లో మొట్టమొదటిది సంక్షేమం. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయనకు సానుకూలం కాబోతున్నాయి. జగన్‌ ఎక్కువగా ఆశ పెట్టుకున్నది కూడా వీటిపైనే. నా వల్ల మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి.. లేకుంటే లేదని ఖరాఖండీగా చెప్పింది కూడా ఈ సంక్షేమ పథకాలపై ధైర్యంతోనే. ఆ సంక్షేమ పథకాలే మళ్లీ జగన్‌ను గెలిపించేందుకు కీలక పాత్ర పోషించాయి. అందుకే మహిళలు, పింఛనుదారులు పోలింగ్‌ కేంద్రాలకు బారులు తీరారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్‌ పెరిగింది. ఇవన్నీ జగన్‌కు సానుకూలాంశాలే. సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందిన మహిళలు, పింఛనుదారులు భారీ స్థాయిలో పోలింగ్‌కు తరలివచ్చి ఫ్యాన్‌కు గుద్దేశారు. .

రెండో కారణం పేదల ప్రభుత్వం అన్న ముద్ర. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో పేదలకు ఎలా మేలు చేయాలా అన్నదే ప్రధానాంశంగా పాలించాడు. ఆయన ఫస్ట్ ప్రయారిటీ బడుగు బలహీన వర్గాలే అయ్యాయి. అంతే తప్ప.. కార్పొరేట్‌ కంపెనీలు, పరిశ్రమలు అంటూ గాల్లో మేడలు కట్టలేదు. అందువల్ల జగన్ అంటే పేదల ప్రభుత్వం.. చంద్రబాబు అంటే కార్పొరేట్ల రాజ్యం అన్న ముద్ర జనంలో బలంగా ఏర్పడిపోయింది. అందుకే పేదలు పట్టుబట్టి మళ్లీ జగన్‌కే ఓటేశారు.

జగన్‌కు పట్టంకట్టబోతున్న మూడో ప్రధాన కారణం ప్రజల ఇంటి ముందుకు దిగివచ్చిన ప్రభుత్వం. జగన్ అధికారంలోకి రావడంతోనే ప్రజల ముంగిటకు పాలన తీసుకొచ్చారు. ప్రత్యేకించి సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు పాలనపరంగా ఎంతో సౌలభ్యం తీసుకొచ్చాడు. గతంలో ఎంతో ప్రయాసపడే పనులు కూడా ఇప్పుడు ప్రజలకు చిటికెలో అయిపోతున్నాయి. సర్టిఫికెట్లు, అనుమతులు, పింఛన్లు.. రేషన్‌.. ఇలా ఒకటేమిటి అన్నీ గుమ్మం ముందు వాలిపోతున్నాయి. ఏ సమస్య ఉన్నా పిలిస్తే పలికేంత దూరంలో వాలంటీర్‌ ఉన్నాడు. ఇలా ప్రజల ముందు వచ్చిన ప్రభుత్వం జగన్‌ను మళ్లీ అధికారంపై కూర్చోబెడుతోంది. వాలంటీర్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేశారు. వాలంటీర్ల ప్రభావం ఓటింగ్‌పై స్పష్టంగా కనిపించింది.

ఇక జగన్‌ను గెలిపించబోతున్న నాలుగో కారణం.. పోల్‌ మేనేజ్‌మెంట్‌.. జగన్‌ ఈ విషయంలో చాణక్యుడి అంతా చెప్పుకునే చంద్రబాబు కంటే ఎంతో ముందున్నాడు. చంద్రబాబు పొత్తులతో కుస్తీ పడుతున్న సమయంలోనే జగన్‌ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి వారికి తగినంత ప్రచారం చేసుకునే అవకాశం కల్పించాడు. ఐ ప్యాక్ట్‌ నుంచి అందుతున్న సమాచారంతో తగిన ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేసుకున్నాడు. అభ్యర్థులను ప్రకటించి ఊరుకోకుండా వారు గెలిచేందుకు అన్ని విధాలుగా ఆర్థిక సాయం అందిచడం వంటి పోల్‌ మేనేజ్‌మెంట్‌లో జగన్‌ చంద్రబాబు కంటే చాలా ముందున్నాడనే చెప్పాలి. ఇది జగన్‌కు బాగా అడ్వాంటేజ్‌ అయ్యింది.

జగన్‌ గెలుపునకు మరో ప్రధాన కారణం చంద్రబాబుపై ప్రజలకున్న అపనమ్మకం.. ఆయన చేతులారా చేసుకున్న తప్పిదాలు. జగన్‌ పథకాల వల్ల రాష్ట్ర సర్వ నాశనం అయిపోతోందని మొదటి నుంచి చెబుతూ వచ్చిన చంద్రబాబు.. జగన్‌ కంటే ఎక్కువ పథకాలు ప్రకటించడంతో ప్రజల్లో ఆయన పట్ల విశ్వసనీయతపోయింది. దీనికి తోడు గతంలో ఆయన పలు ఎన్నికల్లో ఇచ్చిన వందల వాగ్దానాలను చెత్తబుట్టలో పారేసిన జ్ఞాపకాలను ఓటర్లను భయపెట్టాయి. ఎలాగైనా జగన్‌ను ఓడించాలన్న కసి తప్ప.. కూటమికి ఎలాంటి ప్రాతిపదిక లేకపోవడం కూడా జగన్‌కు కలసి వచ్చింది. అంతా కలసి ఒక్కడిని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సింపతీ కూడా జగన్‌కు కలసి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: