బాబోయ్‌.. వచ్చే ఐదు రోజులు ఎండలే ఎండలట?

Chakravarthi Kalyan
ఏప్రిల్ రాక ముందే ఎండలు మండిపోతున్నాయి. అసలే ఎండలు మండుతుంటే.. ఇప్పుడు మరో బ్యాడ్‌ న్యూస్‌ చెబుతోంది వాతావరణ శాఖ.. వచ్చే ఐదు రోజుల్లో ఢిల్లీతోపాటు అనేక రాష్ట్రాల్లో ఎండలు భారీగా పెరుగుతాయట. ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్.. ఐఎమ్‌డీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వాయువ్య భారతం, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో వడగాడ్పులు బాగా వీస్తాయట. గురువారం నుంచి ఐదు రోజులపాటు ఎండలు కనీసం 40 డిగ్రీలు ఉంటాయట. ఇంకా అంత కంటే ఎక్కువే ఉంటాయి తప్ప తక్కువ కాదని ఐఎండీ చెబుతోంది. ఈ ఎండల పెరుగుదలకు కారణం.. రాజస్థాన్-పాకిస్తాన్ సరిహద్దులోని యాంటీ సైక్లోన్ సిస్టమేనట. మరి ఈ మార్చి నెలాఖరులోనే ఎండలు ఇలా చంపేస్తుంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎలాగో ఏంటో అని జనం ముందే హడలిపోతున్నారు. అందుకే కాస్త తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్లండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: