ఆ స్వామీజీ చెంతకు జగన్.. ఎందుకంటే..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్ ఇటీవల శంషాబాద్‌ ముచ్చింతలలోని సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్యల విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన స్వామీజీ చిన జీయర్ స్వామిని కలుసుకున్నారు. అయితే.. చిన జీయర్ స్వామిని కలసిన రెండు, మూడు రోజుల్లోనే జగన్ మరో స్వామీజీని కలవబోతున్నారు.
ఏపీ సీఎం జగన్.. ఇవాళ విశాఖ వెళ్తున్నారు. అక్కడ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవంలో పాల్గొంటారు. స్వామీజీ స్వరూపనేంద్రను కలుసుకుంటారు. ఈ పర్యటన కోసం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ ఇవాళ ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరతారు. సీఎం జగన్ ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గాన ఉదయం 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. శ్రీ శారదా పీఠంలో జగన్ ఒంటిగంట వరకు ఉంటారు. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో జగన్ మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి విజయవాడ వచ్చేస్తారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: