బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?
తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తోంది. దానిని ఆదర్శంగా తీసుకొని ఏపీ ప్రభుత్వం ఇవ్వనున్నట్టు సీఎస్ చెప్పకనే చెప్పారు. అయితే సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ నివేదిక 27 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని సీఎస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సీఎస్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్ ను సిఫారసు చేసింది సీఎస్ కమిటీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై 11 వ వేతనసంఘం సిఫారసులపై నివేదికను తాజాగా ఇచ్చింది. సీఎం జగన్ పీఆర్సీపై 72 గంటల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.