ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం..!

N ANJANEYULU
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత రెండేళ్ల నుంచి సంచలనంగా మారిన మూడు రాజధానులు వ్యవహారానికి సంబంధించి శాసన సభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు  ప్రకటించింది. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీనికి సంబంధించి మంత్రి కొడాలి నాని స్పందిస్తూ సాంకేతికంగా చాలా సమస్యలు వస్తున్నాయని అందుకే 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుంచి ప్రకటన వస్తుందని నాని మీడియా ముందు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో తాము బయట మాట్లాడకూడదని పేర్ని నాని పేర్కొన్నారు. కాసేపట్లో దీనికి సంబంధించి మరో బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మూడు రాజధానులు రద్దు చేసేసం అని ఏజీ  చెప్పారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: