బ‌ద్వేలు: ఏడో రౌండ్‌లో వైసీపీ మెజార్టీ ఇదే..

VUYYURU SUBHASH
ఏపీలోని క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ రోజు జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బ‌ద్వేలు లో 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్త‌య్యింది. అధికార వైసీపీ జెట్ రాకెట్ స్పీడ్ తో దూసుకు పోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం ఏడు రౌండ్లు పూర్త‌య్యే స‌రికి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి వెంక‌ట సుధ‌కు ఏకంగా 60, 765ఓట్ల మెజార్టీ వ‌చ్చింది. ఇప్ప‌టికే ఆమెకు 74 వేల ఓట్లు వ‌చ్చాయి. అయితే బీజేపీ అభ్య‌ర్థి సురేష్ కు కూడా ఏకంగా 14 వేల పై చిలుకు ఓట్లు రావ‌డం విశేషం. ఇక బీజేపీ ముందు నుంచి అంచ‌నాలు వేసుకున్న‌ట్టుగా ఆ పార్టీ కి ఇక్క‌డ 18500 ఓట్లు వ‌చ్చేలా ఉన్నాయి. మ‌రో ఐదు రౌండ్ల ఓట్ల లెక్కింపు ఇప్పుడు ఇక్క‌డ మిగిలి ఉంది. ఏదేమైనా జ‌గ‌న్ అనుకున్న‌ట్టు గా ఇక్క‌డ వైసీపీ మెజార్టీ ల‌క్ష దాటి పోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: