ఢిల్లీ స్టూడెంట్ : కేజ్రీతో సోనూ ఏం చర్చించాడంటే ?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడం కాదు
మంచి చదువులు అందించి
దేశాభివృద్ధికి దోహదం కావడమే ఇప్పటి ఆయన నినాదం
మంచి పనికి ఈ శుక్రవారం ఆరంభం కానుంది. మంచి అంటే చదువులకు మంచి..అని అర్థం లేదా విద్యార్థులకు మంచి అని అర్థం. ఢిల్లీ రాజకీయాలకు ఈ తరహా మంచి అర్థం అవుతుందో లేదో కానీ మన ఐఆర్ఎస్ ఆఫీసర్ కేజ్రీ కి మాత్రం ఈ మంచి అంటే భ లే ఇ ష్టం. అవును! దేశాన్ని కదిపేసే రాజకీయం కన్నా దేశాన్ని ప్రభావితం చేసే చదువే మిన్న అన్న నినాదం ఎప్పటి నుంచో ఉంది. దేశ్ కా మెంటార్స్ కార్యక్రమం పేరిట ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమానికి సోనూ ఓ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు . ఈ సందర్భంగా విద్యార్థులకు వారి కెరియర్ కు సంబంధించి గైడెన్స్ ఇవ్వడం అన్నది ఆనందంగా ఉందని సోనూ వ్యాఖ్యానించా రు.కేజ్రీ ఈ నిర్ణయం వెలువరించిన వెంటనే సోషల్ మీడియా నుంచి మంచి స్పందన వచ్చింది. ఎప్పటి నుంచో సోనూ సేవలను విని యోగించుకోవాలని భావిస్తున్న కేజ్రీకి ఈ సందర్భంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని నుంచి ప్రారంభం అయి న ఈ పరివర్తన లేదా చైతన్య కార్యక్రమం ఇటు తెలుగు రాష్ట్రాలకూ ఓ దారి చూపాలని కోరుకుందాం.