16 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి పెళ్లాం విలువ తెలింది. అది ఎలా అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే .యూపీలోని ఆజంగఢ్కు చెందిన ఓ 16 సంవత్సరాల బాలుడికి మేజర్ యువతితో వివాహామైంది. అయితే బాలుడు ఎవరితో ఉండాలనే విషయంపై అతడి తల్లి,భార్య మధ్య వివాదం తలెత్తింది.చివరికి ఈ వివాదం అలహాబాద్ హైకోర్టుకి చేరింది. హైకోర్టు బాలుడి అభిప్రాయం అడగగా అతడు భార్య వద్దే ఉంటానన్నాడు.అయితే మైనార్టీ తీరకపోవడంతో అతడిని 2022 ఫిబ్రవరి 24 వరకు ప్రభుత్వ షెల్టర్ నిహోంలో ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది.ఈ 16 ఏళ్ల బాలుడికి ఓ బాబుకూడా పుట్టాడు.