దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతికి ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి కేరళలో రాత్రి కర్ఫ్యూ విధించనుంది. పలు రాష్ట్రాల్లో కేసుల జోరుకు బ్రేక్ పడడం లేదు. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ రోజు నుంచే రాత్రి కర్ప్యూ అమల్లోకి తీసుకు వచ్చింది. రోజుకు 18 వేల కేసులు కేరళలో నమోదవుతున్నాయి. కేరళకు వచ్చే ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది.