బంగారం ప్రియుల‌కు ఇంత‌కు మించిన గుడ్ న్యూస్ ఉండ‌దు..

VUYYURU SUBHASH
పసిడి ప్రేమికులకు తీపికబురు వ‌చ్చేసింది. గ‌త కొద్ది రోజులుగా క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోన్న బంగారం వ‌రుస‌గా త‌గ్గ‌డం ఇది మూడో రోజు కావ‌డం విశేషం. బంగారం ధర పడిపోతే వెండి రేటు మాత్రం పరుగులు పెట్టింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పెరిగింది. వెండి రేటు మాత్రం పడిపోయింది. ఇక స్థానికంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 క్షీణించింది. దీంతో రేటు రూ.45,700కు తగ్గింది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 క్షీణతతో రూ.41,900కు తగ్గింది.బంగారం ధర పడిపోతే.. వెండి రేటు మాత్రం పైపైకి కదిలింది. వెండి ధర రూ.400 పరుగులు పెట్టింది. దీంతో కేజీ వెండి ధర రూ.70,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: