రాబోయే రోజుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి.... భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత....?
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఉజ్జయిని మహంకాళి భవిష్యవాణిని స్వర్ణలత వినిపించింది. కరోనా వ్యాధి గురించి పలువురు భక్తులు వేసిన ప్రశ్నలకు ఎవరు చేసుకున్నది వాళ్లు అనుభవించక తప్పదని పేర్కొంది. రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని కష్టాలు తప్పవని తెలిపింది. ప్రజలంతా మరింత జాగ్రత్తగా ఉండాలని కష్టాలను కడతేరుస్తున్నారని చెప్పింది.
కరోనాను కట్టడి చేస్తానని తనకు మాత్రం తృప్తి లేదని స్వర్ణలత తెలిపింది. తనకు పూజల్లో ఎటువంటి సంతోషం, తృప్తి లేదని పేర్కొంది. ప్రజలను కాపాడటానికి తప్పనిసరిగా పోరాడతానని... ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపింది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని మరోమారు సూచించింది.