బ్రేకింగ్ : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం.... ?

Reddy P Rajasekhar

తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు నిలిపివేయాలని ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం అని పేర్కొంది. ప్రజరోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఐ.సీ.ఎం.ఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు ప్రభుత్వం అరకొర సమాచారం ఇస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందంటూ పేర్కొంది. 
 
మీడియా బులెటిన్ లో వార్డుల వారీగా సమాచారం అందించాలని గతంలో ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల వివరాలను... కరోనా పరీక్షల వివరాలను... కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాల గురించి చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నెల 17లోగా ఆదేశాలు తప్పనిసరిగా అమలు కావాలని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: