అయోధ్యలో రామ మందిరం భూమి పూజ వాయిదా.... ఎందుకంటే...?
దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు చైనా భారత్ సరిహద్దు వివాదం కొనసాగుతోంది. దీంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తలపెట్టిన భూమి పూజ తాత్కాలికంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం జూలై 1న రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగాల్సి ఉండగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉంది.
కాటేజీలు, ఇతర వసతుల నిర్మాణ పనులను కూడా శంఖుస్థాపనతో పాటే ప్రారంభించాలని అనుకున్నారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని అందరూ భావించారు. తాజాగా భూమిపూజ వాయిదా పడటంతో కొత్త తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది. మరోవైపు అయోధ్యలోని మంజా గ్రామంలో సరయూ నది ఒడ్డున 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని యోగీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.