రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిని వివాహం చేసుకున్న యువతి.... ఏం జరిగిందంటే....?

Reddy P Rajasekhar

వినటానికి విచిత్రంగా ఉన్నా ఒక యువతి రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిని వివాహం చేసుకుంది. నల్గొండ జిల్లాలోని కనగల్ లో ఒక యువతికి పెద్దలు కుదిర్చిన పెళ్లి జరిగిన మరునాడే ప్రియుడితో మరోసారి వివాహం జరిగింది. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌనిక అనే యువతి వరుసకు మామ అయిన రాజేష్ గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే మౌనిక కుటుంబసభ్యులు యువతికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయించి శుక్రవారం రోజున ఘనంగా వివాహం జరిపించారు. మౌనిక పెళ్లి అయిన కొంత సమయం తరువాత ఆమె వద్దకు ప్రియుడు రాజేశ్ వెళ్లగా ఆమె అతడిని పట్టుకుని ఏడ్చింది. ఇది చూసి షాక్ అయిన మౌనిక భర్త పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లిని రద్దు చేసుకున్నాడు. అనంతరం నిన్న మౌనిక - రాజేశ్‌లకు గుడిలో ఇరువురి బంధువుల సమక్షంలో ప్రేమపెళ్లి జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: